ఆమదాలవలస పట్టణంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ఆఫీస్ వద్ద ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శాసన సభ్యులు కూన రవి కుమార్ శనివారం నిర్వహించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్య క్రమాలతో కూన రవికుమార్ ప్రజలకు మరింత చేరువ కానున్నారని అన్నారు.