సచివాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్)పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్ని శాఖల మధ్య ఉన్న డేటాను ఆర్టీజీఎ్‌సతో అనుసంధానం చేసే పనుల్లో వేగం పెరగాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రస్తుతం అందిస్తున్న సేవలతోపాటు అదనంగా ఏం అందించగలమో పరిశీలించాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంలో సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,770 సీసీ కెమెరాలు వినియోగంలో ఉన్నాయని, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరస్తులను పట్టుకోవడంలో ఏఐ సాంకేతికను ఉపయోగించుకోవాలని నిర్దేశించారు. నేరం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వెళ్లి, నేరస్తులు పారిపోకుండా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు. రౌడీషీటర్లపై ముందుగానే నిఘా పెట్టి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీజీఎస్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఏయే దశల్లో ఉన్నాయో ఆ విభాగం సీఈవో దినేశ్‌కుమార్ వివరించారు. ఏఐ వినియోగంలో గూగుల్ సంస్థ సహకారం అందిస్తోందని చెప్పారు.
![]() |
![]() |