కూటమి ప్రభుత్వంలో హోం శాఖకు కేటాయింపుల్లో పెద్దపీట వేయనుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో బడ్జెట్‌లో కేటాయింపులు లేక హోం శాఖ నిర్వీర్యం అయ్యింది. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టం, సీసీ కెమెరాల నిర్వహణకూ నిధుల్విలేదు. పోలీస్ స్టేషన్లు అధ్వానంగా తయారయ్యాయి. హోం శాఖ ప్రతిపాదనలు, అంచనాలపై గతంలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలకు అవసరమైన నిధులు, వసతులు కేటాయిస్తుంది.
ఈగల్ వ్యవస్థ, జైళ్ల నిర్మాణం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుంది. ఆక్టోపస్, అప్పా, గ్రే హౌండ్స్ ఏర్పాటుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాలని కోరాం. కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టి పోలీస్ శాఖను పటిష్ఠం చేయడంపైనా దృషి సారించాం. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్‌మ్యాన్ గన్ మ్యాగ్జైన్ మిస్ అవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం’ అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
![]() |
![]() |