వంశీలాంటి వ్యవస్థీకృత నేరగాడిని సమర్థిస్తూ జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోంది. దళితులు, మహిళలంటే జగన్కు చిన్నచూపు. వారికన్నా వంశీలాంటి రౌడీలు జగన్కు ఎక్కువయ్యారా? తప్పుని తప్పని ఖండించకపోగా సమర్థించడం ఏమిటి?’ అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ‘దళిత బిడ్డను బెదిరించి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి వంశీ కుట్రపన్నారు. ఇంత బరితెగించిన వ్యక్తిని జగన్ ఎలా సమర్థిస్తారు? ఇకపై వైసీపీ నాటి అరాచకాలు పునరావృతం కానివ్వబోం’ అని నిమ్మల స్పష్టం చేశారు.
![]() |
![]() |