రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ అనడం హాస్యాస్పదం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అయన మాట్లాడుతూ... టీడీపీ కార్యాలయంపై దాడులు చేసిన వారి విషయంలో చట్టప్రకారం నడుచుకుంటున్నాం. నేరగాళ్లను సమర్థించడం జగన్ నైజాన్ని బయటపెట్టింది. అధికారంలో ఉన్నా లేకున్నా దళితులను వైసీపీ వారు టార్గెట్ చేయడం దారుణం’ అని పల్లా అన్నారు. రాజ్యాంగ బద్దంగా అన్యాయాలకు, అక్రమాలకు దౌర్గన్యాలకి పాల్పడిన వారికీ చట్టప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయో వాటిని కూటమి ప్రభుత్వం అమలుచేసి తీరుతుంది అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా ప్రభుత్వం నడుచుకుంటుంది అని తెలియజేసారు.
![]() |
![]() |