జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ గుగులోత్ రవి సతీసమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం పక్షాన మేళతాళాలతో స్వాగతం పలికిన పిదప వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీ నివాసా చార్యులు , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు నేరెళ్ల విజయ్ , సముద్రాల వంశీకృష్ణ మరియు సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.
![]() |
![]() |