సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామ శివారులో స్వయంభుగా వెలసిన గంగమ్మ తల్లి జాతరకు ఆలయం ముస్తాబయింది. అమీనాబాద్ గ్రామం నుండి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయంలోకి తెస్తారు. అమ్మవారిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
పసుపు,బండారాలు, చీరలు, గాజులు, మొదలైన వస్తువులు అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. 21న అంకమ్మ పండగ ఊరేగింపు ఉంటుంది. 22న జరిగే గంగ తల్లి జాతరను ఘనంగా నిర్వహించుకుంటారు. జాతరకు ఏర్పాట్లు వివిధ పార్టీల ప్రతినిధులు, గ్రామ నాయకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయం పూజారి బత్తుల వీరమ్మ అన్నారు..
![]() |
![]() |