శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం భీరుపూర్ గ్రామము & మండలం జగిత్యాల జిల్లా గల హుండీలు తేది 19-02-2025 రోజున విప్పిలెక్కించగా మొత్తము ఆదాయము రూపాయలు 13,69,163 /- రాబడినది. మరియు మిశ్రమ బంగారం 06 గ్రాములు , మిశ్రమ వెండి 01 కిలో 280 గ్రాములు , విదేశి నోట్స్ 20 రాబడినది.
ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , దేవాదాయశాఖ జగిత్యాల జిల్లా పరిశీలకులు ఎం. రాజమౌళి , కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రాంఛంధర్ రావు, మాజి ఎంపీపీ మసర్తి రమేష్ , దేవస్థానం రెనవేషన్ కమిటి మాజి అధ్యక్షులు ఏ.సామ్రాట్ ఎన్ .సుమన్ , మాజి సర్పంచ్ శిల్ప రమేష్ , మాజి ఎంపీపీ శ్రీమతి జితేందర్ , భీరుపూర్ పొలీస్ స్టేషన్ సిబ్బంది ఆర్..సత్యనారాయణ , బి. వెంకటేష్ , భీరుపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చకులు వొద్దిపర్తి సంతోష్ కుమార్ , తిరుమల సేవా గ్రూప్ ఇంచార్జి ఏ.రవీందర్ & సభ్యులు దేవస్థానం సిబ్బంది భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.
![]() |
![]() |