సబ్బవరం మండలం బంగారంపాలెం శివారు ఏ. సిరసపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఆలయంలో గణపతి పూజ, విష్వక్సేన ఆరాధన, పుణ్యావచనం తదితర కార్యక్రమాలు జరిపించారు.
![]() |
![]() |