నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మంగళవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా శ్రీశైలంకు చేరుకున్న గవర్నర్ కు శంకర అతిథి గృహం వద్ద కార్యనిర్వాహణాధికారి యం.శ్రీనివాసరావు స్వాగతం పలికారు.ఉగాది పండుగ మహోత్సవాల సందర్భంగా స్వామివార్ల దర్శనార్ధమై ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న గవర్నర్ కు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో భాగంగా కార్యనిర్వాహణాధికారి అధికారులు, అర్చక వేదపండితులు స్వాగతం పలికారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో గవర్నర్ కు అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు వల్లించారు. కార్యనిర్వాహణాధికారి స్వామివార్ల శేషవస్త్రాలను, జ్ఞాపికను, తీర్థం మహాప్రసాదములను అందజేశారు. ఈకార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.
![]() |
![]() |