ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన కృషికి ఈ నామినేషన్ లభించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ వెల్లడించాయి.ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో దక్షిణాసియాలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకు ఆయన 2019లోనూ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రతి సంవత్సరం నోబెల్ కమిటీ వందలాది నామినేషన్లను స్వీకరిస్తుంది. అనంతరం, ఎనిమిది నెలల సుదీర్ఘ ప్రక్రియ ద్వారా విజేతలను ఎంపిక చేస్తుంది.పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంతో ఆయన అధికారాన్ని కోల్పోయారు.
![]() |
![]() |