దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ. 41 తగ్గించాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు (ఏప్రిల్ 1) ధరలను సవరించాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. తగ్గిన ధరలతో ఈరోజు నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,762గా ఉండనుంది. హైదరాబాద్ లో రూ. 1,985, చెన్నైలో రూ. 1,921, ముంబైలో రూ. 1,713గా ధర ఉండబోతోంది.
![]() |
![]() |