క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈరోజు కూడా పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు మూడు సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లిన ప్రతిసారీ కాకాణి వారికి కనిపించలేదు. ఇప్పుడు మూడోసారి కూడా విచారణకు ఆయన డుమ్మా కొట్టడంతో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. గతంలో కూడా ఓ కేసులో ఇలాగే తప్పించుకు తిరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కాకాణి చివరకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
![]() |
![]() |