తిరుమల స్వామివారిని టాలీవుడ్ స్టార్ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు పూజాకు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
![]() |
![]() |