రాజమహేంద్ర వరంలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి బలవన్మరణం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యార్థిని సూసైడ్ నోట్ ప్రకారం ఇప్పటికే ఆసుపత్రి ఏజీఎం దీపక్‌ను పోలీసులు అరెస్టు చేశారని పవన్ చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థినులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని నాగాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
![]() |
![]() |