జైపూర్ నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు. బాత్రూమ్‌లో పెట్టిన లేఖతో కలకలం.. విమానం విమానం అప్పటికే ముంబైకి సమీపించి ఉండటంతో, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. రాత్రి 8.50కి విమానం భూమిపైకి దిగింది. భద్రతా నియమాల ప్రకారం, విమానాన్ని ఇతర విమానాల నుంచి దూరంగా తరలించి ప్రత్యేక స్థలంలో నిలిపారు.విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించామని అధికారులు తెలిపారు. ఎటువంటి అనవసర గందరగోళం లేకుండా ప్రయాణికులను క్రమంగా బయటకు తీసుకువచ్చారు. సిబ్బంది ప్రాంప్ట్‌గా స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టు స్పష్టం చేశారు.
![]() |
![]() |