ట్రెండింగ్
Epaper    English    தமிழ்

300 సినిమాల చరిత్రకు మళ్లీ ఊపిరి పోశారు,,,చిగురించిన 'సినిమా చెట్టు'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 08:29 PM

ఏపీలో సినిమా చెట్టు గురించి తెలిసే ఉంటుంది.. దాదాపు 300కుపైగా సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఈ సినిమా చెట్టు ఉంది. అయితే ఈ చెట్టు గతేడాది భారీ వర్షాలు, వరదలకు కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ చెట్టు మళ్లీ చిగురించింది.. మళ్లీ ఆ చెట్టుకు ప్రాణం పోశారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమహేంద్రవరం ఐకాన్స్, గ్రీన్ భారత్ వనం-మనం విభాగం కలిసి దీనికి పునర్జీవం పోశారు. రేకపల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో చెట్టుకు రసాయనాలతో చికిత్స చేశారు. వేరు మధ్యలో ఒక కొత్త మొక్కను నాటారు. ఇప్పుడు ఆ మొక్క 10 అడుగుల ఎత్తుకు ఎదిగింది. ఈ సినిమా చెట్టుకు మళ్లీ పునరుజ్జీవం వచ్చింది.


ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల చిత్రీకరణ జరిగింది.. ఈ చెట్టుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. ఈ చెట్టు గోదావరి గట్టున ఉంది. దీని పేరు నిద్రగన్నేరు వృక్షం. ఇది చాలామందికి ఇష్టమైన చెట్టు. గతేడాది వరదల కారణంగా చెట్టు రెండుగా చీలిపోయింది. అది నేలకూలడంతో చాలామంది బాధపడ్డారు. రాజమహేంద్రవరంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ఆ చెట్టును బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. వేర్లు, కొమ్మలు కత్తిరించి రసాయన మిశ్రమాలు పూశారు. గాలి, ధూళి తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


ఆ తర్వాత కొద్దిరోజులకు చెట్టు కాండం, కొమ్మల భాగాల్లో పచ్చని చిగుళ్లు వచ్చాయి. తర్వాత ఆ చెట్టు ఏపుగా పెరిగింది. ఆ తర్వాత రైతులు ఎలుకల బెడదతో ఇబ్బంది పడ్డారు. మొలకలు రాగానే ఎలుకలు తినేస్తుండటంతో నష్టం వాటిల్లింది. ముగ్గురు వ్యక్తులు నిరంతరం పొలం వద్ద ఉండి, రసాయనాలు చల్లుతూ పంటను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకోవడంతో చెట్టు ఇప్పుడు 10 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. మొత్తానికి ఎంతో చరిత్ర ఉన్న ఈ చెట్టును బతికించారు.. స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్టు వచ్చే ఏడాదికి నలుగురికి నీడను ఇస్తుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa