దీపావళి అంటేనే సెల్రబ్రేషన్ ఆఫ్ లైట్స్. మరి ఆ లైట్స్‌ని వెలిగించాలంటే స్విచ్ ఆన్ చేయాల్సిందే. దీనికోసం స్విచ్ బోర్డ్‌పై చేతులు పెడుతుంటాం. కానీ, మనం వాటిని ఎప్పుడూ క్లీన్ చేయం. దీంతో మరకలు ఏర్పడతాయి. వీటిని చూసినప్పుడు ఇల్లంతా క్లీన్‌గా ఉన్నప్పటికీ స్విచ్ బోర్డ్ మాత్రం తెల్లని బోర్డ్‌పై నల్లని మరలకు జిడ్డు పట్టి, నల్లగా మారి చూడ్డానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనిని మనం క్లాత్‌తో క్లీన్ చేసినా త్వరగా వదలవు. గట్టిగా రుద్దుదామంటే బోర్డ్, స్విచెస్ పాడవుతాయేమోనని భయం. కాబట్టి, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా స్విచ్ బోర్డ్‌పై మరకల్ని ఎలా వదిలించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే ఎక్కువగా రాయడం, తుడవడం వంటి పనులు లేకుండానే స్విచ్ బోర్డ్‌పై మరకలు వదులుతాయి. పైగా దీనికోసం బయటి నుంచి ఎలాంటి క్లీనింగ్ ఏజెంట్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోని కొన్ని పదార్థాలతోనే స్విచ్ బోర్డ్‌ని క్లీన్ చేయొచ్చు. మరి పదార్థాలు ఏంటి వాటితో ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.
టూత్‌పేస్ట్
టూత్‌పేస్ట్ కేవలం మన దంతాలను మాత్రమే కాదు. ఇంట్లో కొన్ని వస్తువుల్ని కూడా క్లీన్ చేయడానికి చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పేస్టులో క్లీనింగ్ ఏజెంట్ ఉంటుంది. దీనిని వాడి స్విచ్ బోర్డ్‌పై మరకల్ని , దుమ్ము, ధూళిని, పసుపు పచ్చ జిడ్డు మరకల్ని వదిలించొచ్చు. దీనికోసం కొద్దిగా టూత్‌పేస్ట్‌ని మనం వాడి పాడేసే టూత్ బ్రష్‌పై పెట్టండి. దీంతో మెల్లిగా స్విచ్ బోర్డ్‌ని స్క్రబ్ చేయండి. కార్నర్స్, మరకలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడ కొద్దిగా రుద్దండి. ఎక్కువగా తడి ఉండొద్దు పల్గ్స్ ఉన్న చోట అసలే రుద్దొద్దు. చుట్టూ పక్కల మరకలు ఉన్న చోట మాత్రమే రాయండి. కాసేపు అలానే ఉంచండి. తర్వాత తడి గుడ్డతో మరకలపై రాసి తుడవండి. దీంతో కొన్ని నిమిషాల్లోనే మరకలు వదిలి స్విచ్ బోర్డ్స్ కొత్తవాటిలా మారతాయి. ఇది చాలా బాగా పనిచేసే టిప్ అని చెప్పొచ్చు.
నిమ్మరసం, ఉప్పు
నిమ్మరసం, ఉప్పు రెండింటి కలయిక గాఢమైన మరకల్ని, దుమ్ము, ధూళిని దరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. నిమ్మలోని అసిడిక్ గుణాలు జిడ్డుని తగ్గించగా, ఉప్పు మరకల్ని చక్కగా వదిలిస్తుంది. వీటికోసం ఏం చేయాలంటే ఓ నిమ్మకాయని కట్ చేయండి. దానిపై కొద్దిగా ఉప్పు చల్లండి. ఆ నిమ్మ చెక్కతో మరకలపై రుద్దండి. ఈ రెండింటి కాంబినేషన్, దుమ్ము, ధూళి, మరకల్ని ఎలాంటి గీతలు పడకుండానే దూరం చేస్తుంది. అయితే, ఈ టిప్స్ ఫాలో అయ్యే ముందుగా కచ్చితంగా పవర్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. దీని వల్ల కరెంట్ షాక్ వంటి ప్రమాదాల నుంచి తప్పించుకున్నవారవుతారు.
నెయిల్ పాలిష్ రిమూవర్
కొన్ని మరకల్ని మనం ఎంత క్లీన్ చేసినా దూరం చేయాలంటే అలాంటి టఫ్ మరకల్ని దూరం చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్‌తో దూరం చేయొచ్చు. కొద్దిగా కాటన్ బాల్ తీసుకుని దానిపై నెయిల్ పాలిష్ రిమూవర్ వేయండి. దీనిని మరకలు, జిడ్డు ఉన్న చోట రాయండి. తర్వాత ఓ సారి రుద్దండి. కాసేపటి తర్వాత మరోసారి తడిగుడ్డతో క్లీన్ చేయండి. దీంతో చాలా వరకూ మరకల వదలుతుంది. మరక వదిలితే సరే, లేదంటే మరక వదిలేవరకూ ఒకటికి రెండు సార్లు చేయండి.
మరకల్ని క్లీన్ చేసే ముందు
ముందుగా ఎలక్ట్రిసిటీ సప్లైని రిమూవ్ చేయండి. ఆ తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేయండి.
క్లీన్ చేసేటప్పుడు నేల తడిగా ఉండొద్దు. అదే విధంగా, చెప్పులు వేసుకోవాలి.
తుడిచాక మళ్ళీ స్విచ్ బోర్డ్స్ పూర్తిగా ఆరాకే పవర్ సప్లై స్టార్ట్ చేయండి.
ఏ టిప్ వాడే ముందైనా స్విచ్ బోర్డ్స్ పైనే స్టార్ట్ చేయండి. అంతేకానీ, ఫ్లగ్స్ దగ్గర చేయొచ్చు.
నెయిల్ పాలిష్ రిమూవర్, నిమ్మరసం వంటి లిక్విడ్స్ వాడి క్లీన్ చేసేటప్పుడు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రమాదాలు జరగకుండా
తడి చేతులతో, కాళ్ళతో క్లీనింగ్ మొదలుపెట్టొద్దు.
తడి క్లాత్‌తో తుడవడం మంచిది కాదు.
ముఖ్యంగా, ఐరన్, స్విచెస్ దగ్గర తడి క్లాత్ వాడకపోవడమే మంచిది.
ఇప్పుడు చెప్పిన సొల్యూషన్స్ అన్నీ కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే దొరికే పదార్థాలతోనే క్లీన్ చేయడానికి వాడొచ్చు. అయితే, వీటిని వాడే ముందు కచ్చితంగా పవర్ సప్లై ఆఫ్ చేయాలి. పర్తిగా ఆరాకనే పవర్ సప్లై ఆన్ చేయాలి.
తడి చేతులు, కాళ్ళు ఉండకూడదు.
సమస్యలు రాకుండా ముందునుంచీ జాగ్రత్తగా ఉండడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa