ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల కడుపులో నులి పురుగులు ఉంటే ,,,,, నిర్లక్ష్యం చేయకండి

Life style |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 10:24 PM

పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వాళ్లు ఈజీగా వ్యాధుల బారిన పడతారు. ఇక, కడుపులో నులిపురుగులు పిల్లల్లో ఒక సాధారణ సమస్య. ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. నులి పురుగులు కడుపులో లేదా పేగుల్లో సంతానోత్పత్తి చేసి.. శరీరంలో అన్ని పోషకాల్ని గ్రహిస్తాయి. పిల్లలు మలవిసర్జన చేసినప్పుడు.. మలంలో కనిపిస్తాయి. అంతేకాకుండా.. కడుపులో లెక్కలెనన్నీ నులి పురుగులు ఉండవచ్చు. ఈ సమస్య వల్ల పిల్లలు అలసట, బలహీనత సమస్యలతో బాధపడతారు.


అందుకే చిన్నారుల కడుపులో నులి పురుగుల సమస్యను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. పిల్లల కడుపులో నులి పురుగులు ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో డాక్టర్ నిశాంత్ గుప్తా చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసుకున్నారు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చుద్దాం.


 కడుపులో నులి పురుగులకు కారణాలు


* కలుషితమైన ఆహారం తినడం


* కలుషితమైన పానీయాలు తాగడం


* అపరిశుభ్రత


* మట్టి తినడం


* సరిగ్గా ఉడికించని ఆహారం తినడం


* తీపి ఎక్కువగా తినే పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుంది.


నులి పురుగులు ఉంటే కనిపించే లక్షణాలు


* దుర్వాసనతో కూడిన మలం


* మలద్వారం వద్ద దురద


* చేతులు, కాళ్లపై ఎర్రటి దద్దర్లు


* పిల్లల కడుపులో నులిపురుగులు ఉంటే.. కడుపు మీద పడుకుండారు


* పళ్ళు కొరకడం


* పిల్లలు నిద్రపోతున్నప్పుడు నోటి నుంచి లాలాజలం రావడం ప్రారంభమవుతుంది.


* పిల్లలు చిరాకుగా ఉండటం


* పిల్లల కళ్ళలోని తెల్లటి భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో నల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి.


కడుపులో నులి పురుగులు ఉంటే ఏం జరుగుతుంది?


* నులిపురుగులు ఉన్న పిల్లలు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కడుపు ఉబ్బరంతో బాధపడతారు.


* ఆకలి తగ్గుతుంది లేదా అస్సలు ఆకలి ఉండదు.


* వేగంగా బరువు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది.


* తరచుగా.. కడుపు నొప్పి అనుభూతి చెందుతుంది.


* జ్వరం వచ్చి పొడి దగ్గు మొదలవుతుంది.


* రక్తహీనత రావచ్చు.


* మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది


* పురుగులు మలం ద్వారా లేదా వాంతులు ద్వారా బయటకు వస్తాయి.


ఎలా నివారించాలి?


* పిల్లలకు నులి పురుగులు రాకుండా నిరోధించడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయి. బిడ్డ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి.


* పిల్లలకు పరిశుభ్రత అలవాటును పెంపొందించండి. పిల్లలు బయట ఆడుకుని తిరిగి వచ్చినప్పుడల్లా చేతులు, కాళ్లు శుభ్రం చేయండి.


* పిల్లలు మట్టి తినకుండా జాగ్రత్త పడండి.


* పండ్లు, కూరగాయల్ని తినడానికి ముందు బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే, పచ్చి కూరగాయలు పిల్లలకు తినిపించవద్దు. పచ్చి కూరగాయల్లో చిన్న కీటకాలు ఉండొచ్చు.


* పిల్లల్ని పచ్చి మాంసాన్ని తినినివ్వకూడదు.


* పిల్లలకు పబ్లిక్ ట్యాంకులు మొదలైన వాటి నుంచి నీరు ఇవ్వకండి. ఈ నీరు కలుషితమై ఉండొచ్చు.


ఈ చిట్కా పనికొస్తుంది


కడుపులోని నులి పురుగుల్ని చంపడానికి, జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడానికి దానిమ్మ పండు బెస్ట్ ఆప్షన్. పిల్లల చేత దానిమ్మ రసం తాగించాలి. ఇందుకోసం దానిమ్మ గింజల్ని మిక్సీ వేసి.. రసం తీసుకోవాలి. ఇందులోకి ఎటువంటి పదార్థాలు వాడకూడదు. అలా తీసిన రసాన్ని పిల్లల చేత తాగించాలి. ఇలా చేయడం వల్ల వారి కడుపులోని నులి పురుగులు చనిపోతాయని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa