డిజిటల్ ప్రపంచంలో AI-జనరేటెడ్ ఫోటోల సంఖ్య పెరిగిపోవడంతో, నిజమైన, నకిలీ ఫొటోల మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతోంది. దీనిని అధిగమించడానికి, గూగుల్ తన జెమిని యాప్‌లో AI డిటెక్షన్ ఫీచర్‌ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫోటో AI ద్వారా సృష్టించబడిందా, నిజమైనదా అని తెలుసుకోవచ్చు. గూగుల్ తన ఇన్ విజిబుల్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ, సింథిడ్‌ను దీనికోసం ఉపయోగిస్తుంది. ఈ ఫీచర్ త్వరలో వీడియో, ఆడియో, డిజిటల్ క్రియేటివ్ కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది. ఇది డిజిటల్ పారదర్శకతను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa