ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్‌తో పనిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 07:15 PM

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్సులు, రైళ్లల్లో సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ వినిపించింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం- విజయవాడ మధ్య 12 జన్‌సాధారణ్‌ రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.జనవరి 12 నుంచి13, 14వ తేదీ వరకూ.. అలాగే జనవరి 16, 17, 18 తేదీల్లో ఈ జన్‌సాధారణ్ రైళ్లు సేవలుఅందిస్తాయి.మరోవైపు ఈ రైళ్లు అన్ని అన్‌రిజర్వ్‌డ్. విశాఖపట్నం- విజయవాడ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలు (08567) రైలు ఈ తేదీలలో రోజూ ఉదయం పది గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.


ఇక విజయవాడ - విశాఖపట్నం జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలు (08568) ఈ తేదీలలో రోజూ సాయంత్రం 6.30 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరుతుంది. రాత్రి 12.35 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఈ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దువ్వాడ రైల్వేస్టేషన్, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట రైల్వేస్టేషన్, రాజమండ్రి, నిడదవోలు రైల్వేస్టేషన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం రైల్వేస్టేషన్ల మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


విశాఖపట్నం- విజయవాడ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలు (08567)


విశాఖపట్నం - 10:00


దువ్వాడ - 10:28


అనకాపల్లి - 10:43


ఎలమంచిలి - 11:01


  by TaboolaSponsored Links


You May Like


Open an account today!


Interactive Brokers


మీరు మెచ్చే కథనాలు


ఉద్యోగులకు ఊరట.. PF ఖాతా అప్డేట్ రూల్స్ మారాయ్.. ఇక పేరు నుంచి నేషనాలిటీ వరకు అన్నీ మార్చుకోవచ్చు!


రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తే రూ.50 వేలు ఫైన్.. తేల్చి చెప్పిన కేంద్రం


సంక్రాంతి ఎఫెక్ట్.. గోదావరి జిల్లాల్లో లాభసాటి వ్యాపారం ఇదే.. ఏకంగా 3 నుంచి 4 రెట్లు..


నేటి నుంచే LIC కొత్త స్కీమ్.. ఒక్కసారి కడితే జీవితాంతం బీమా.. కనీస పెట్టుబడి, అర్హతలు, బెనిఫిట్స్ వివరాలు ఇవే


తుని- 11:26


అన్నవరం -11:41


సామర్లకోట -12:09


రాజమండ్రి -13:05


నిడదవోలు - 13:34


తాడేపల్లిగూడెం -13:50


ఏలూరు - 14:28


గన్నవరం-14:56


విజయవాడ-16:00


విజయవాడ - విశాఖపట్నం జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలు (08568)


విజయవాడ - 18:30


గన్నవరం - 18:55


ఏలూరు- 19:28


తాడేపల్లిగూడెం - 20:03


నిడదవోలు - 20:20


రాజమండ్రి - 20:53


సామర్లకోట - 21:43


అన్నవరం - 22:12


తుని -22:27


ఎలమంచిలి - 22:56


అనకాపల్లి -23:14


దువ్వాడ - 00:01


విశాఖపట్నం -00:35







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa