ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి పంచుమూర్తి అనురాధ 23 ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. అసమ్మతి ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.