అహింసా రన్ అంటూ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పీటీ ఉష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘అహింసా, ఫిట్ నెస్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే ప్రపంచవ్యాప్తంగా అహింసా రన్ నిర్వహించారు. విజయవాడలో అహింసా రన్లో పాల్గొనడం చాల సంతోషంగా ఉంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఉదయం గ్రౌండ్లో చాలా మంది యువ క్రీడాకారులను చూశా. క్రీడల పట్ల యువతలో మక్కువ పెరుగుతోంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మరింతగా వసతులు కల్పించాలి. నేను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి మూడు, నాలుగు నెలలే అవుతుంది. అసోసియేషన్లో అనేక సమస్యలున్నాయి. అఫ్లియేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశాను. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నా. ఒలింపిక్ అసోసియేషన్ అంటే ఒకటే అసోసియేషన్. అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని పీటీ ఉష తెలిపారు.