అది జాతీయ రహదారి. అప్పుడప్పుడే చీకటి పడింది. వాహనాలన్నీ దూసుకెళ్తున్నాయి. ఇంతలో ఆ హైవే పైకి ఓ బైక్ వచ్చింది. ఆ బైక్‌ను చూసి రహదారిపై వెళ్తున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ఆ బైక్‌పై ఓ ప్రేమ జంట వెళ్తోంది. బైక్‌పై ప్రేమ జంట వెళ్తే తప్పేంటి అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ బైక్ వెళ్తుండగానే దానిపైనే ముద్దులు, హగ్‌లతో వారు రెచ్చిపోయారు. దీంతో అదే జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులోని వ్యక్తి ఈ వ్యవహారం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ సమీపంలో ఉన్న ఇందిరాపురం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. యువతిని బైక్‌పై ముందు ఉండే పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడు కూర్చొబెట్టుకున్నాడు. ఆ యువతి ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో రెచ్చిపోయింది. అదే సమయంలో ఆ యువకుడు బైక్‌ను అతి వేగంగా డ్రైవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అదే జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ ప్రేమికుల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా బహిరంగంగా కొందరు ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో కాస్త ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చేరింది. దీనికి తోడు పలువురు నెటిజన్లు కూడా వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేయడంతో చర్యలు చేపట్టారు. ఆ వీడియోల్లో కనిపించిన బైక్ నంబరు ఆధారంగా.. భారీగా ట్రాఫిక్ చలాన్లు విధించారు. వివిధ నిబంధనలు ఉల్లంఘించారని.. వారిపై ఏకంగా రూ.21 వేల జరిమానా వేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు రూ. వెయ్యి, నంబర్ ప్లేటు తప్పుగా ఉన్నందుకు రూ.5 వేలు, కాలుష్యానికి సంబంధించి సరైన నియమాలు పాటించనుందుకు రూ. 10 వేలు, పబ్లిక్ ప్రాంతాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు మరో రూ. 5 వేలు విధించారు. దీంతో మొత్తం ఆ బైక్‌పై రూ. 21 వేలు ఫైన్లు వేశారు.