గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కీపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు నేటితో ముగియనుందని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే నేడు సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని కోరారు. పరీక్షకు హాజరైన 2.32 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని, కీ పై వచ్చిన అభ్యంతరాలపై నిపుణులతో చర్చించి ఫైనల్ కీ విడుదల చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa