జార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రోజు రాంచీ-పాట్నా రహదారిపై పద్మ-రోమి సమీపంలో ఓ టాటా సుమో వాహనం బైకును తప్పించబోయి రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో తొమ్మిది మంది ఉన్నారు. పోలీసులు జేసీబీ సాయంతో కారును బయటికి తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa