ఇటీవల చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతక విజేతలను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సత్కరించిన మరుసటి రోజు, ప్రతిపక్ష నాయకుడు భూపిందర్ సింగ్ హుడా పతక విజేతల పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.5 కోట్లు, రజత పతక విజేతలకు రూ.3 కోట్లు, దేశానికి కాంస్య పతకాలు సాధించిన వారికి రూ.2 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లే డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి ఉన్నత పదవుల్లో క్రీడాకారులు కూడా నియామకం పొందాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్ పాలసీ కింద దాదాపు 750 మంది ఆటగాళ్లను ఉన్నత పదవుల్లో నియమించామని, అయితే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ధోరణికి స్వస్తి పలికిందని హుడా చెప్పారు.