చిత్తూరు జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి - కాట్పాడి రైలు మార్గంలో.. పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో రైల్వే పట్టా విరిగింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది వెంటనే గుర్తించింది. అదే సమయంలో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్.. రామేశ్వరం నుంచి తిరుపతికి వెళుతోంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. రామేశ్వరం తిరుపతి ఎక్స్ ప్రెస్‌ను మార్గం మధ్యలో ఆపి యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు రైల్వే సిబ్బంది.. వెల్డింగ్ చేసిన తర్వాత ట్రాక్ మళ్లీ సిద్ధమవడంతో.. రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరి తిరుపతికి చేరుకుంది. సకాలంలో పట్టా విరిగినట్లు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది అంటున్నారు ప్రయాణికులు. రైలు పట్టా అలా విరిగిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.