ఆంధ్ర రత్న భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మనకున్న ఈ హక్కులు అన్ని మన రాజ్యాంగం కల్పించినవేనని.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని విమర్శించారు. స్వాతంత్య్ర పౌరులను సయితం అవమానిస్తోందని, అంబేద్కర్ను హేళన చేస్తోందని, మహాత్మ గాంధీని విలన్గా చూపిస్తున్నారని, మహాత్మను చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని దుయ్యబట్టారు. మతం,కులం పేరుతో బీజేపీ నేతలు కలహాలు రేపుతున్నారని, దేశ సంపదను ప్రధాని మోదీ దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.