విజయనగరం జిల్లా, వేపాడ మండలంలోని వల్లంపూడిలో సాంబమూర్తి తీర్ధమహోత్సవం శుక్ర, శనివారాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లంపూడి, వేపాడ గ్రామస్థులు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. శని వారం సాయంత్రం ఎడ్ల పరు గు ప్రదర్శన నిర్వహించారు. పోటీల్లో 16 ఎడ్లబండ్లు పాల్గొనగా నిర్వాహకులు విజేతలకు నగదుబహు మతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రుద్ర అంజలి, రుద్ర వెంకటరావు పాల్గొన్నారు.