చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ నేత రోజా పరామర్శించారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి ఈరోజు ఆమె వెళ్లారు. ఆయన చిత్రపటం ముందు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. 'ప్రేమతపస్సు' చిత్రం ద్వారా రోజాను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది శివప్రసాదే అన్న విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa