కార్లు, ఆటోలు, బైక్ లు.. ర్యాష్ డ్రైవ్ చేస్తే పోలీసులు చలాన్లు, ఫైన్లు వేస్తుంటారు. ఐతే… ఈ వీడియోలో ఆటోపై అదిరిపోయే స్టంట్ చేశారు ఇద్దరు యువకులు. ఆటో రన్నింగ్ లో ఉండగా.. దాని వెనుకవైపున ఉన్న టైర్ మార్చేశారు. వింటుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా. స్టంట్ కూడా చాలా డేంజరస్ కండిషన్ లో ప్లాన్ చేశారు. ఏమాత్రం తేడా కొట్టినా.. ఆటో బోల్తాపడటం ఖాయం.. అందులో స్టంట్ చేసేవారికి.. డ్రైవర్ కు గాయాలవడం ఖాయం.
పెద్దగా వాహనాల రాకపోకలు లేని రోడ్డును ఎంచుకున్నారు. ఆ రోడ్డుపై ఆటో రన్నింగ్ లో ఉండగానే… ఒకవైపున వంచారు. ఓ వ్యక్తి ఆటోనుంచి బయటకు వంగి.. టైరును తీస్తాడు. మరో ఆటోలో వచ్చిన వ్యక్తి.. స్టెప్పిన్ టైర్ అందిస్తాడు. ఆ టైర్ ను.. ఆటోకి మళ్లీ బిగించి.. మళ్లీ ఎప్పటిలాగే… ఆటోను సరిచేసి.. నడిపిస్తాడు డ్రైవర్.
ఈ స్టంట్ ను లైవ్ లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు ఆ యువకులు. ఎన్ని టైర్లు మార్చడం చూశాం.. కానీ.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అని కామెంట్లు పెట్టారు ఇంటర్నెట్ యూజర్స్. ఇది జేమ్స్ బాండ్ స్టైల్ అని కొందరన్నారు. టాలెంట్ ఐతే.. అదిరిపోయింది.. ఇలా ఎవరూ ట్రై చేయొద్దని సూచించారు.
I’ve seen a lot of tyres being changed.......but this one is James Bond style !
pic.twitter.com/jhKGqVydiS
— Harsh Goenka (@hvgoenka) September 22, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa