ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జైల్లో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు రిమాండ్ ను పొడిగించారు. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఆయన్ని ఏలూరులోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. వచ్చే నెల 9 వరకూ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2017లో ఒక స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి, కులం పేరుతో ఆ వ్యక్తిని దూషించారన్న ఆరోపణలపై చింతమనేనిపై ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి చింతమనేని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa