బుల్‌బుల్ తుపాను ముప్పు వల్ల ఒడిశా, బంగాల్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రకృతి విపత్తు మరో మూడు గంటల్లో... బంగాల్లోని సాగర్ ద్వీపం- బంగ్లాదేశ్‌లోని ఖెపుపరా ప్రాంతంలో తీరం దాటే అవకాశముంది. బుల్‌బుల్ గంటకు 110-120 కి.మీల వేగంతో దూసుకొస్తుందని.. ఆ సమయంలో ఈదురు గాలులు బలంగా వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అయితే తీరం దాటక ముందే తన ప్రతాపాన్ని చూపిస్తోంది బుల్‌బుల్ తుపాన్. ఈ ప్రకృతి విపత్తు వల్ల ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురు గాలుల శబ్దాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa