ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుడికి ఆగ్రహం..వధువు రియాక్షన్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 06, 2021, 05:01 PM

అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలే వైరల్ వీడియోల రూపంలో వాట్సప్, ఫేస్ బుక్ లలో తెగ షేర్ అవుతుంటాయి. నెటిజన్ల కామెంట్లతో నెట్టింట రచ్చనే క్రియేట్ చేస్తుంటాయి. అచ్చం అలాంటిది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకలో జరిగిన ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం, వరుడి ఆగ్రహం అన్నీ సమపాళ్లల్లో ఉండటంతో నెటిజన్ల మనసును చూరగొంటోంది. అన్నింటికీ మించి వరుడి రియాక్షన్ తరువాత వధువు రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందో ఏమో కానీ ఈ పెళ్లి వీడియోను నెటిజన్లు ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఇంతలోనే ఆ ఫొటో గ్రాఫర్ కు ఏమనిపించిందో ఏమో కానీ, కేవలం వధువు పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఒకటి రెండు ఫొటోలయితే పర్లేదు కానీ అదే పనిగా ఆమెనే ఆ ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీయడం మొదలు పెట్టాడు. క్లోజ్ షాట్స్ కూడా తీశాడు. ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహాన్ని చూసి ఆ వరుడికి ఒళ్లు మండిపోయింది. తనను పక్కన పెట్టేసి కేవలం వధువునే ఫొటోలు తీస్తున్నాడని ఆగ్రహం వచ్చింది. అంతే వధువును ఫొటో తీస్తున్న సమయంలోనే ఆ ఫొటోగ్రాఫర్ మెడపై ఒక్కటి పీకాడు. దీంతో ఆ ఫొటోగ్రాఫర్ ఒక్కసారిగా అదిరిపోయాడు. ఆ తర్వాత జరిగింది గ్రహించి సారీ చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa