విజయనగరం జిల్లాలో మరో ఆక్సిజన్ ట్యాంక్ అందుబాటులోకి వచ్చింది. సోమవారం విజయనగరం కేంద్రాసుపత్రిలో 10 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ ను కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్, ఎంపి బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ... వార్డులకు పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తామన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఎంపి తన నిధుల నుంచి రూ.20 లక్షలను కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa