విజయనగరం: 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి, జిల్లాలోని ప్రభుత్వేతర నర్సింగ్ స్కూల్స్‌లో జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ, స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ స్కూల్స్ లో 3 సంవత్సరాల శిక్షణలో చేరేందుకు ఈనెల 27న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా ఆరోజు ఉదయం 9 గంటలకు, జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి హాజరు కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa