కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ పాసులు, దీర్ఘకాల పాసులు శాశ్వత నివాస హోదా దరఖాస్తుల ఆమోదానికి కొవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. అలాగే.. వర్క్ పాసులు పునరుద్ధరణ చేసుకునేవారు సైతం తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందేనని తెలిపింది. అయితే, 12 ఏళ్లలోపు పిల్లలు, వైద్య పరంగా వ్యాక్సిన్ కు అర్హత లేనివారికి ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భయాలతో........ 10 ఆఫ్రికా దేశాలపై విధించిన ఆంక్షలను సింగపూర్ ఎత్తివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa