ప్రకాశం జిల్లా: చిన్నకొత్తపల్లికి చెందిన అన్నదమ్ములు ఇంటి స్థలం విషయంలో ఏడుకొండలు, వీరయ్యల మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఘర్షణ పడి... పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అద్దంకి-నాగులపాడు రోడ్డులోని ఓ ఇంటి ముందు ఆగి ఉన్న కారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితురాలు కె భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa