ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక..!

international |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 09:05 AM

కరోనా మహమ్మారి బారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడూ ఏదో ఒక కొత్త వేరియంట్ వెలుగుచూస్తోంది. ఇక తాజాగా కరోనా ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధానమ్‌ మాట్లాడారు. కరోనా ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని, ముఖ్యంగా వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉండే గ్రూపుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని టెడ్రోస్‌ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa