తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. నగరంలోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa