ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగొస్తున్న బంగారం...వెండి కూడా అదే బాటలో..ఎందుకో తెలుసా

national |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 09:21 PM

పసిడి పేదోడు అందుకోలేని స్థాయికి పైపైకి ఎగబాకింది. కానీ పరిస్థితి ఇపుడు మారుతోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో తొలుత పరుగులు పెట్టిన బంగారం ధర ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. యుద్ధం మొదలైనప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపర్లు ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారు. ఫలితంగా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనున్న నేపథ్యంలో మదుపర్లు బంగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగానూ పుత్తడి, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర గరిష్ఠంగా 2069 డాలర్లకు చేరింది. మంగళవారం మాత్రం ఇది 1915 డాలర్లకు క్షీణించింది. ఇక, భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53 వేలుగా ఉండగా, వెండి ధర కిలో రూ. 69,600గా ఉంది. ఈ నెల 8న వీటి ధరలు వరుసగా  రూ.55,100, రూ. 72,900 ఉన్నాయి. అంటే వారం రోజుల వ్యవధిలో బంగారంపై రూ. 2,100, వెండిపై రూ. 3,300 తగ్గడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com