నిర్ణీత ధరల కంటే నిత్యవసర వస్తువులు, ముఖ్యంగా వంట నూనెలను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేపల్లె తహసీల్దార్ డి. మల్లికార్జునరావు అన్నారు. రేపల్లె తహసీల్దార్ కార్యాలయంలో మర్చంట్స్ అసోసియేషన్ వ్యాపారు లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి దుకాణంలో వంట నూనె స్టాక్, ధరల వివరాలను ప్రదర్శన బోర్డులో వినియోగదారులకు కనిపించే విధంగా రాసి ఉంచాలన్నారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా, బోర్డులలో స్టాక్, ధరల వివరాలను ప్రదర్శించకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎస్ డిటీ వెంకటేశ్వరరావు, మర్చంట్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు ఆటపాల రామకృష్ణ గురుస్వామి, సభ్యులు పాల్గొన్నారు