కర్నూలు నగరంలోని స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు భవనంలో పొట్టి శ్రీరాములు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని వారు కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణానే త్యాగం చేశారన్నారు.
కార్యక్రమంలో డీఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు, డ్వామా పీడీ అమరనాథరెడ్డి, డీపీవో నాగరాజు నాయుడు, సర్వశిక్ష అభియాన్ పీవో రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.