ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్లకు నో పర్మిషన్..రూలింగ్ తీసుకువచ్చారు స్పీకర్ తమ్మినేని. అయితే.. స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగుపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోనుతో రికార్డు చేసి మీడియాకు టీడీపీ సభ్యులు చేరవేస్తున్నారని సమాచారం ఉందని స్పీకర్ పేర్కొన్నారు.వైసీపీ సభ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకువస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మండి పడ్డారు. సభలోకి ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకు రాకూడదని స్పష్టం చేసింది స్పీకర్ తమ్మినేని. ఎవ్వరి మనోభవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను సభలోకి అనుమతించకపోవడమే సరైన విధానమని చెప్పారు స్పీకర్ తమ్మినేని. సెల్ ఫోన్లను వాలంటరీగా సరెండర్ చేయాలన్న స్పీకర్… టీడీపీ సభ్యులు స్పీకర్ సూచనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మార్షల్స్ నెట్టేస్తున్నారన్న అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ పార్టీ సభ్యులు. మార్షల్స్ వారి విధులను వాళ్లు నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది స్పీకర్. దీంతో ఏపీ అసెంబ్లీ తీవ్ర గందర గోళం నెలకొంది.