కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్ద పల్లి గ్రామ పంచాయతీ మిట్టపల్లి నందు జగనన్న కాలనీ గృహ నిర్మాణ పనులను గ్రామ పంచాయతీ సెక్రెటరీ ప్రసాద్ రెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు ప్రతాప్ నాయుడు మరియు నరసింహారెడ్డి అక్కడ జరుగుతున్న పనులను చూడడం జరిగింది.
ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని తెలియజేశారు. ఇప్పటివరకు 11 మంది మాత్రమే బేస్ మట్టం వరకు పూర్తి చేశారని మిగతా వారు కూడా పూర్తిచేయాలని ఆయన అన్నారు. పక్కా గృహాలకు ఎటువంటి ఆటంకం లేకుండ నీటి వసతి కూడా సమకూరుస్తామని ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణాలు లబ్ధిదారులు పాల్గొన్నారు.