ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు సిక్కు సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని పూర్తిచేశారు.
ఈ అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. భుటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగమంత్రి ధనంజయ్ రాంఫుల్ పాల్గొన్నారు.