సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ధనుర్మాసం పురస్కరించుకుని వేంకటేశ్వరునికి, లక్ష్మి దేవి, గోదాదేవికి గంధంతో అలంకరించారు. గంధం సేవలో పాల్గొనటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు శ్రీ రాంబాబు, అనీల్, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.