విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలుగు భాషా పలుకుబడి వినసొంపైనది.
అది సంగీతంలా ఉంటుంది. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగును.. వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు’’అని ఆయన తెలిపారు.