AP: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ కీలక నేత పేర్ని నాని మండిపడ్డారు. డిసెంబర్ 10న తన భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని ఆయన తెలిపారు. అక్కమార్కుడిగా నేనేదో ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు పనులు చేశానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. 'మా అత్తమామలు నిర్మాణం చేసి గోడౌన్ మాకు ఇచ్చారు. నేను కానీ నా భార్య కానీ రోజు వెళ్లి చూసేదేమీ ఉండదు' అని స్పష్టం చేశారు.